Friday, February 4, 2011

అసిడిటీ సమస్య వేదిస్తుంటే

 అసిడిటీ సమస్య వేదిస్తుంటే
ఒక గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్లు ఉసిరి పొడి కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే అసిడిటీ సమస్య క్రమంగా తగ్గుతుంది.

Wednesday, February 2, 2011

కడుపులో తిప్పుతున్నట్టు, వాంతి అయ్యేట్టుగా అనిపిస్తుంటే

 కడుపులో తిప్పుతున్నట్టు, వాంతి అయ్యేట్టుగా అనిపిస్తుంటే
కడుపులో తిప్పుతున్నట్టు, వాంతి అయ్యేట్టుగా అనిపిస్తుంటే నోట్లో 3-4 లవంగాలు వేసుకుని నమిలితే సమస్య తగ్గుతుంది.

Tuesday, February 1, 2011

అసిడిటి, అజీర్తితో బాధపడేవారు

 అసిడిటి, అజీర్తితో బాధపడేవారు
అసిడిటి, అజీర్తితో బాధపడేవారు పరగడుపున టీ స్పూన్ అల్లంరసంలో ఐదారు చుక్కల తులసి రసం లేదా చిటికెడు మెంతిపొడి కలిపి తీసుకుంటే క్రమంగా అసిడిటి, అజీర్తి తగ్గుతాయి.

Wednesday, January 19, 2011

కీళ్ళనొప్పులతో బాధపడుతుంటే

 కీళ్ళనొప్పులతో బాధపడుతుంటే
కీళ్ళనొప్పులతో బాధపడుతుంటే... ఉల్లిపాయలు మెత్తగా నూరి ఆవ నూనెలో వేయించి నొప్పి ఉన్నచోట పట్టు వేస్తే ఉపశమనం కలుగుతుంది.

Wednesday, January 5, 2011

కఫంతో కూడిన దగ్గు విపరీతంగా ఉంటే

 కఫంతో కూడిన దగ్గు విపరీతంగా ఉంటే
కఫంతో కూడిన దగ్గు విపరీతంగా ఉంటే టీ స్పూన్ తేనెలో చిటికెడు కరక్కాయ పొడి కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. దీనిలో కొంచెం తులసి ఆకుల పొడి కూడా కలిపి తీసుకోవచ్చు.

Monday, December 27, 2010

తలనొప్పి తగ్గాలంటే

 తలనొప్పి తగ్గాలంటే


తలనొప్పి తగ్గాలంటే... దాల్చిన చెక్కను నీటిలో అరగదీసి దానిని పలుచటి లేపనంగా నుదిటిపై రాయాలి. ఆరిన తర్వాత కడిగి మళ్లీ రాయాలి. ఇలా నాలుగు సార్లు చేస్తే నొప్పి మాయమవుతుంది.

Wednesday, December 22, 2010

కందిపోయే అందం

కందిపోయే అందం
న శరీరం యావత్తూ కణాలతోనే నిర్మింతమైంది. ఈ కణాలు ఆక్సిజన్‌ను ఉపయోగించుకుని శక్తిమంతంగా ఉంటాయి. అయితే ఈ ప్రక్రియలో భాగంగా 'ఫ్రీరాడికల్స్‌' అనే విశృంఖల కణాలు పుడతాయి. ఇవి శరీరంలోని కణాలను దెబ్బతీస్తుంటాయి. దీన్నే 'ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌' అంటారు. ఈ ఒత్తిడి తగ్గాలంటే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయల వంటి సహజమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఒంట్లో ఫ్రీరాడికల్స్‌ ఎక్కువైన కొద్దీ.. కణ క్షీణత పెరిగి.. మన అందం, యవ్వన ఛాయలు కూడా క్షీణించిపోయి.. ముసలి రూపు వచ్చేస్తుందని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి అందం చెడకూడదంటేసహజమైన ఆహారంపై దృష్టిపెట్టాలి.