Wednesday, November 24, 2010

జలుబు తీవ్రమై గాలి పీల్చడానికి కష్టంగా ఉంటే

 జలుబు తీవ్రమై గాలి పీల్చడానికి కష్టంగా ఉంటే
 
చలికాలంలో తరచుగా జలుబు వేధిస్తుంటుంది. జలుబు తీవ్రమై గాలి పీల్చడానికి కష్టంగా ఉంటే ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో రెండు వెల్లుల్లి రెబ్బలను చిదిమి వేసుకుని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా రెండు రోజులు చేస్తే ఉపశమనం ఉంటుంది.

Monday, November 22, 2010

హెల్త్ టిప్స్

 హెల్త్ టిప్స్ 
టీ స్పూన్ నిమ్మరసం, అర టీ స్పూన్ అల్లం రసం, పావు టీ స్పూన్ మిరియాలపొడి కలిపి రోజుకి రెండు సార్లు తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.

ఆహారంలో క్రమం తప్పకుండా సోయాబీన్స్ తింటే కంటి సమస్యలతోపాటు ఒంట్లో కొవ్వుకణాలు కూడా తగ్గుతాయి. శరీరం తేలికగా అనిపిస్తుంది.

ఎసిడిటీ, అజీర్తితో బాధపడుతుంటే ఉదయాన్నే పరగడుపున టీ స్పూను అల్లంరసంలో అయిదారు చుక్కల తులసి రసం లేదా చిటికెడు మెంతిపొడి కలిపి తీసుకోవాలి.

Wednesday, November 17, 2010

హెల్త్ టిప్

 హెల్త్ టిప్
 
 భోజనం చేసిన తర్వాత అరుగుదల కాక కడుపునొప్పి వస్తే కొంచెం వాము నమిలితే ఉపశమం కలుగుతుంది.

Friday, November 12, 2010

తీరైన ఆకృతి కోసం

తీరైన ఆకృతి కోసం 

వ్యాయామం చేయకపోవడం.. ఆహార నియమాలను సరిగ్గా పాటించకపోవడం వల్ల నడుం చుట్టూ కొవ్వ పేరుకుపోతుంది.ఫలితంగా పొట్ట వస్తుంది.అది మరన్ని సమస్యలకు దరి తీస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆహరం విషయం లో జాగ్రత్త వహించాలి.
  1. తీసుకునే ఆహరం లో తృణ దాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రాగులు,జొన్నలు,ఓట్స్ లలో తక్కువ కేలోరిలు ఉంటాయి.బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఎక్కువగా తీసుకోవటం మంచిది.
  2. పొట్ట వలన మదుమేహం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని స్పానిష్ వైద్య నిపుణులు ఓ అద్యనంలో వెల్లడించారు. ఇందుకు మనం తీసుకునే ఆహారంలో కార్బో హైడ్రేడ్లు ముఖ్య  కారణం. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది.భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు నివారించాలి అంటే ఆలివ్ నూనె ను తరుచు ఉపయోగించాలి.
  3. నీళ్ళు ఎక్కువగా తాగాలి.నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తరుచూ తీసుకోవాలి.ముఖ్యంగా దోసకాయ,బొప్పాయి, పుచ్చ కాయ, నారింజ, సొరకాయ, బీరకాయ వంటివి తరచూ తీసుకుంటే నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గుతుంది.
  4. ఎరుపు రంగు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోగలిగితే నడుము చుట్టూ కొవ్వు పెరుకోదు.
  5. తరచూ గ్రీన్ టీ తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుందని.. సుమారు 500 మంది మహిళల ఫై జపాన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.